నిజమైన విజేతలు:- -గద్వాల సోమన్న,-9966414580
ప్రశాంతమైన చిత్తము
పుట్టించును సంతోషము
అదే అసలు ఐశ్వర్యము
తెలుసుకొనుము ఈ సత్యము

మనశ్శాంతి లేకుంటే
ఎంత ఉన్న గుండు సున్న
అదే గనుక మనదైతే
లేదు అంత కన్న మిన్న

ఇంద్రియాలపైన అదుపు
జీవితాల్లో గెలుపు
జయిస్తే మగధీరులు
విశ్వంలోనే విజేతలు

దుర్గుణాల నియంత్రణ
జీవితాలకు రక్షణ
ఆదిలోనే అణచితే!
జీవితాంతము ఘనతే!


కామెంట్‌లు