చలి -గిలి ...!!: --డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 చలిపులి 
కొరికేస్తోంది ,
గజగజ--
వణికిస్తొంది!
రాత్రి ..ఇంట్లో 
రగ్గులు -హగ్గులు 
ఉపయోగానికి 
రావడం లేదు !
పగలు ---
ఇంట్లో చలి ....
బయట ఎండ ...!
సాయంత్రానికి 
ఉష్ణోగ్రతలు -
పడిపోతున్నాయ్ !
సామన్యుడి నిత్య -
జీవితచక్రం మాత్రం
యథాతథం ...!
చలి ..గిలి ...వగైరా 
బడాబాబులకే చెల్లు !!
                ***

కామెంట్‌లు