మబ్బులు
క్రమ్మాయి
ఎండను
తగ్గించాయి
చినుకులు
టపటపరాలాయి
వాతావరణమును
చల్లబరచాయి
మొక్కలు
సంతసించాయి
ఊపిరి
పీల్చుకున్నాయి
మొగ్గలు
తొడిగాయి
సిగ్గులు
ఒలకబోశాయి
వేడిమి
తగిలింది
విరులు
విప్పారాయి
పొంకాలు
చూపాయి
పరిమళాలు
చల్లాయి
హరితవర్ణము
అలరించింది
ఇంద్రధనస్సు
ఆకట్టుకుంది
కొమ్మలు
ఊగాయి
కవులను
తట్టాయి
జాబిలి
వచ్చాడు
వెన్నెలని
చల్లాడు
మదులు
మురిచాయి
కవితలు
జనించాయి
కలము
అక్షరాలను ప్రసవించింది
పుటలు
పదాలను ప్రదర్శించింది
కవనలోకము
కదిలింది
సాహితీజగము
శోభిల్లింది
పదాలు
పాదాలనునడిపించాయి
అక్షరాలు
అందెలనుమ్రోగించాయి
కవులలోకము
కంటుంది
వింటుంది
తట్టుతుంది
పాఠకలోకము
పఠిస్తుంది
పరవశిస్తుంది
పొంగిపోతుంది
సందర్భాలు
స్పందింపజేస్తాయి
అనుభూతులు
అక్షరాలలోపెట్టిస్తాయి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి