బాల్య మిత్రుల అపూర్వ కలయిక

 38సంవత్సరాల క్రితం ఒక్క బెంచీపై కూర్చుని పాఠాలు నేర్చుకున్న బాల్యమిత్రుల అపూర్వ కలయికకు భీమునిపట్నం వేదిక ఐంది. 1986లో భీమునిపట్నం ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా సంస్థలో శిక్షణ పొంది, వేర్వేరు జిల్లాలలో స్థిరపడిన ఆ చిననాటి స్నేహితులిరువురూ నేడు కలుసుకుని గీతాన్ని నెమరువేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కడుము పాతపొన్నుటూరు పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు నేడు భీమునిపట్నం కళాసాహితి ఆధ్వర్యంలో జరిగిన కవుల, కథకుల సమావేశానికి ఆహ్వానం పొందగా, ఈ విషయం తెలుసుకున్న పడెం భానుమూర్తి వేదిక వద్దకు వచ్చి ఆనాటి తోటి శిక్షణార్ధిని ఘనంగా సన్మానించారు. 
భానుమూర్తి ప్రస్తుతం విజయనగరం జిల్లా, భోగాపురం మండలం, బసవపాలేం పాఠశాల లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తున్నారు. 
అనంతరం వీరిద్దరూ తమ భీమునిపట్నం టి.టి.సి.శిక్షణా సంస్థను సందర్శించి, స్థానికంగా సుపరిచితులైన ఆనాటి పౌరులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కుదమ తిరుమలరావు మాట్లాడుతూ శిక్షణనిచ్చి, తమకు ఉద్యోగ జీవితాన్ని ప్రసాదించిన ఈ భీమునిపట్నం ఒక పుణ్యక్షేత్రం వంటిదని, ఇంతటి గొప్ప పర్యాటక కేంద్రం తమ జీవితంలో భాగమగుట తమ పూర్వ జన్మ సుకృతమని అన్నారు. పడెం భానుమూర్తి మాట్లాడుతూ నాతో పాటు శిక్షణ పొందిన కుదమ తిరుమలరావు జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతులమీదుగా పొందుట తనకెంతో గర్వకారణంగా ఉందని, అంతటి ప్రముఖ వ్యక్తితో జీవితానుభవం పంచుకోవడం ఒక మధురానుభూతి అని అన్నారు.
కామెంట్‌లు