కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామపంచాయతీలోని ఇంగ్లీష్ మీడియం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన దేవి సంస్థాన్ పెడగాజి విభాగానికి చెందిన బృందం సభ్యులు శుక్రవారం సందర్శించారు. శుక్రవారం వారు ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ఫౌండేషనల్ లిటరసీ న్యూమరెసి (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. యూకేజీ నుంచి 5వ తరగతి వరకు మొత్తం ఆరు తరగతుల పిల్లల్లో భాషాంశాలతో పాటు గణిత ప్రక్రియలను పరీక్షించారు. పిల్లల చేత తెలుగు, ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాలను చదివించారు. గణితంలో చతుర్విధ ప్రక్రియలోని వివిధ అంశాలను పరీక్షించారు. ఊషన్నపల్లి పాఠశాల పిల్లలు తెలుగు, ఇంగ్లీష్ పాఠాలను చక్కగా చదవడంతోపాటు గణిత సమస్యలను అలవోకగా సాధించడంతో లక్నో బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. వారు పాఠశాల పిల్లల్ని, పాఠశాల సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని ఉషన్నపల్లి పాఠశాల పిల్లలు తెలుగు, ఇంగ్లీష్ పాఠాలను బాగుగా, చక్కగా చదువుతున్నారని, గణిత సమస్యలు చక్కగా చేస్తున్నారని కానీ లక్నోలో మాత్రం ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారన్నారు. ఊషన్నపల్లి పాఠశాల పిల్లల్ని, ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయుడు అమృత సురేష్ కుమార్ లను వారు అభినందించారు. వారి వెంట వచ్చిన పెద్దపల్లి జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి డాక్టర్ పి.ఎం షైక్, డిఆర్పి సంది సంపత్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్, డీఈఓ ఆధ్వర్యంలో ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం విజయవంతంగా ముందుకు వెళ్తుందని, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని కోరారు. ఊషన్నపల్లి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కమిట్మెంట్తో పని చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, బండారి స్రవంతిలు మహారాష్ట్ర లక్నోకు చెందిన దేవీ సంస్థాన్ స్వచ్ఛంద సంస్థ సంస్థ సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి డాక్టర్ పి.ఎం షైక్, డిఆర్పి సంధి సంపత్ రెడ్డి, లక్నోకు చెందిన దేవీ సంస్థాన్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు సయ్య ద్ మహమ్మద్ సలీం, ప్రవీణ్ యాదవ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, బండారి స్రవంతి, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
ఊషన్నపల్లి పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ అమలును పరిశీలించిన లక్నో బృందం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి