సౌందర్య లహరి ..!!: -డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 ఆకులని పూలుగాపేర్చినట్టు 
పూలే ఆకులై విచ్చుకున్నట్టు 
ప్రకృతి అందించింది 
ఈ క్రోటన్ మొక్కను !
సుగంధం -
విరజిమ్మకపోతేనేమి ...
చూపరులను ఆకర్షించే
అందమైన మొక్క.....
మనిషిమనుగడకు ...
ప్రాణవాయువునందించే ,
త్యాగమయి మొక్క...!
మనిషిలోనైనా 
మొక్కలోనైనా ....
ఆస్వాదించాలిగాని 
అనుభవించాలి గాని 
అక్కరకురానిదేముంటుందీ?
చూడగలగాలి గానీ...
సౌందర్యం లేనిదెక్కడ !? 
               ***
 
కామెంట్‌లు