దా0పత్యం....! :- కోరాడ నరసింహా రావు.

 జీవిత చరమా0కం... 
  కన్నబిడ్డలు రెక్కలొచ్చిన పక్షులై... 
  ఎవరి బతుకు పోరులో వారు..! 
   అలసి, సొలసిన వయసులో...
 భార్యకుభర్త-భర్తకుభార్య
 ఒకరి కొకరు తోడు, నీడ 
   పరస్పరం ఒకరి కొకరు ఆలంబన..!! 
   పదవీ విరమణ చేసి ఊసు పోని భర్త...! 
ఊహ తెలిసింది మొదలు విసుగు విరామ మెరుగక శ్రమించి, వడలిపోయిన తనువు - మనసు... 
 ఐనా.. భర్తను ఆనంద పరచటంలోనే తన ఆనందాన్ని వెదుక్కునే.. 
   సగటుభారాతీయ
హిందూ నారి...! 
  ఆమెకు సహక రిస్తూనో 
 ఆ కష్టాన్ని మరిపించే కబు ర్లు చెబుతూనో... 
  కోల్పోయిన దా0పత్య ఆనంద ఘడియలను కూడదీసుకుంటు... 
  భార్య ముఖం లోని ఆనందాన్ని చూసి మురిసి పోతున్న భర్త...!! 
      *****
కామెంట్‌లు