పూర్వము హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. జగన్మాతను గూర్చి వేయి సంవత్సరాలు ఘోర తపస్సు చేసాడు. ఆ తపస్సుకు మెచ్చి ఏదైనా వరం కోరుకోమన్నది. అప్పుడు వాడు"జగన్మాతా! ధన్యోస్మి, నన్ను అనుగ్రహించి నాకు ఒక వరం ఇవ్వాలి. అదే మన, దేవతలందరినీ నేను జయించగలగాలి. ఎవరి చేత నేను చంపబడరాదు. నాకు చావు రాకుండా ఉండాలి, అనగా జగన్మాత నవ్వి"ఏ జీవి అయినా జన్మించేది మరణించుటకే. ఈ ప్రకృతి ధర్మాన్ని ఎవరు మార్చలేరు. త్రిమూర్తులకు కూడా అది సాధ్యం కాదు. కానా వేరొక వరం కోరుకోమన్నాడు. అప్పుడు రాక్షసుడు ఆలోచించి తన వలే గుర్రపు తల, మెడ కలిగిన మరొక ప్రాణి ఈ భూమిపై మరల ఎవరు జన్మించరు. కావున కేవలం అలాంటి వ్యక్తి వల్లనే తాను చంపబడాలి అని అట్టి వరమిమ్మని జగన్మాతను కోరుకున్నాడు. తధాస్తు అని దేవి
వరమొసంగి మాయమాయెను.
ఇక అది మొదలు వాడి దుష్టక్రియలకు అంతం లేకపోయింది. వర ప్రాప్తితో వాడిలో అహం బాగా పెరిగి దేవతలను హింసించడం మొదలెట్టాడు. వర ప్రభావంతో వాడిని ఎవరు కట్టడి చేయలేకపోయారు. దేవతలంతా కలిసి ముకుమ్మడిగా వెళ్లి విష్ణు దేవునితో మొరపెట్టుకున్నారు.
విష్ణు దేవుడు యోగనిద్రలోఉన్నందున వారి విన్నపాన్ని వినలేదు. చేసేదిలేక దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ విని విష్ణువుని లేపాలంటే ఏదో ఒకటి చేయాలని ఆలోచించి ఒక చదపురుగును సృష్టించాడు. చెద పురుగుతో"నీవు వెళ్లి విష్ణుదేవుడు నిద్రించిన వింటినారిని కోరికేయి. అప్పుడు విల్లు కదులుతుంది. విష్ణు దేవుడు మేల్కొంటాడు."అని చెప్పగా ఆ ప్రకారంగా చెదపురుగు వెళ్లి విష్ణు వింటినారిని కొరకగా నారి తెగి ధనుస్సు ఎగిరింది. విష్ణు శిరస్సు కంఠానికి తాకింది. దానితో విష్ణు తల తెగి ఎక్కడో పడిపోయింది. మొండెం ప్రక్కకు ఒరిగిపోయింది. ఊహించని ఈ పరిణామానికి దేవతలంతా భయపడ్డారు. అంతలోనే అక్కడకు బృహస్పతి వచ్చాడు. మీరెవరు భయపడవద్దు. ఆ జగన్మాతను అందరం నేడుకుందాం. ఆమె దారి చూపిస్తుంది అనగా దేవతలంతా జగన్మాతను ప్రార్థించారు.
జగన్మాత ప్రత్యక్షమై"హయ గ్రీవుడనే రాక్షసుని సంహారానికి సమయము ఆసన్నమైనది. విష్ణు మొండెం మునకు గుర్రపు తల అతికించి పునర్జీవిని చేయండి. విష్ణువు హయగ్రీవ స్వామియై ఆ రాక్షసుని సంహరిస్తాడు. మీరంతా ధైర్యంగా ఉండండి. అని అంది.
ఆ ప్రకారంగా వెంటనే విశ్వకర్మ గుర్రపు తలను తెచ్చి విష్ణువు మొండెం మునకు అతికించాడు. వెంటనే విష్ణువు పునర్జీవితుడై హయగ్రీవుని అవతార మెత్తి ఆ రాక్షసుని సంహరించాడు. ఆ రాక్షసుని పీడ తొలగడంతో దేవతలంతా జయ జయ ధ్వనులతో విష్ణువుని కీర్తిస్తూ అంతా ఆనందించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి