ధర్మశాస్త్రం:- గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
ధర్మశాస్త్రం మనఅందరి పత్రిక
అధర్మాన్ని గెలిచిన వీరపుత్రిక
నిత్యం ధర్మదేవతను కొలుస్తుంది
సత్య పథములోను నిలుస్తుంది !

మనం చదివే ఈ ధర్మశాస్త్రం
జనం ఎదిగే యుగధర్మశాస్త్రం
అని తెలుసుకుంటారు అందరు
కని ధర్మాధర్మాలను ఇక విందురు !

ఘనమైన ఈ ధర్మ శాస్త్రం మండి 
మన హిందూ ధర్మ సూత్రం నుండి
పుట్టి పెరిగిందని ఇక తెలుసుకోండి
తెలుసుకొని మీరు మసులుకోండి.!

మనకు ధర్మాన్ని ఎత్తిచూపు శాస్త్రం
ఘనమైన మనం చదివే ఈ ధర్మ శాస్త్రం
ధర్మం  ధర్మ మార్గమైన సంస్కృత పదం
అని మనకు తెలుపుతున్నది మన వేదం. !

ఇట్టి ధర్మ సూత్రాలను అందించే ధర్మశాస్త్రం
గట్టి హిందూ మతాలను ఉద్ధరించే మనఅస్త్రం
కావాలని మనమందరం ఇక ఆశిద్దాం
కలసి మెలసి మనమంతా ఇక పోషిద్దాం !

ధర్మశాస్త్రం చూపించును మనకు దారి
ఆ దారిలోన నడిస్తే మోక్షం దొరుకు మరి
అందుకే నిత్యం చదువు చదివించు
పుణ్యం పురుషార్థం  పొంది ఇక ఆనందించు !

నీ ఆనందాన్ని శ్రోతలకు పంచు
చదివేల వారిని ఇక ప్రేరేపించు
ధర్మశాస్త్రం పరమార్ధాం గ్రహించు
ధర్మ పథంలో ఇక నీవు జీవించు !


కామెంట్‌లు