మన దేహానికి మించిన
దివ్య దేవాలయం లేదు
అంతరాత్మకు మించిన
ఘన దేవదేవుడు లేడు !
మనం దేవుడిని వెతుకుతున్నం
కనిపిస్తే చూడాలనుకుంటున్నం
పూజించాలని చెబుతారు అంతా
అంతా పూజించక పోవుటే వింత !
గుడి గోపురాలలో లేడు దేవుడు
రాళ్ళళ్ళ లప్పళ్ళ లేడు దేవుడు
పుణ్యక్షేత్రాల్లో కూడా లేడు దేవుడు
మన మదిలోనే ఉన్నాడు దేవుడు!
నీలోన ఉన్నాడు ఆ దేవదేవుడు
నీ మదిలోనే ఉన్నాడు ఆ దేవుడు
నీ దేహంలో అణు అణువులోనూ
కొలువైయున్నాడులే ఆ దేవుడు !
శాంతి సహనంలోనూ ఉన్నాడు
కరుణ దయలో కూడా ఉన్నాడు
త్యాగంలోనూ ప్రేమలోనూ కూడా
ఉన్నాడు దేవుడు పరంధాముడు !
పసిపాపల నవ్వుల్లో ఉన్నాడు
వసి వారని పువ్వుల్లో ఉన్నాడు
నిరంతరం మనం తలచే దేవుడు
సర్వంతర్యామియైన మాధవుడు !
మన పూజించే ఈ దేవదేవుడు
అందరివాడు మన కందని వాడు
మన మదిలో కొలువైయున్నవాడు
మనల విడిచి పోనట్టి ఉన్నతుడు వాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి