మన ఋషులు - కనుగొన్న శాస్త్రాలు !:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
 ప్రస్తుతం  మనం అనుభవిస్తున్న, చూస్తున్న, ఆనందిస్తున్న సమస్తము ఏనాడో మన ఋషులు కనిపెట్టినవే అంటే అంత త్వరగా నమ్మలేం. కానీ ఇది నిజం. విమానాలను, విద్యుత్తును, దూరవాణి విశేషాలను , వైద్య శాస్త్రాన్ని, ఆపరేషన్లను, ప్లాస్టిక్ సర్జరీనీ,, విటమిన్లను, భూమి గుండ్రంగా ఉందని, ఆధ్యాత్మిక రంగ విశేషాలను, వివాహ వ్యవస్థ సంబంధాలను మున్నగు వాటిని మన భారతీయ కేసులే ప్రప్రతమున కనుగొన్నారు. అలనాటి మన ఋషులకు మనమెంతో రుణపడి ఉన్నాము.
        భరద్వాజ మహర్షి
        ------------------------
భరద్వాజ మహర్షి ఆకాశంలో ప్రయాణించే రకరకాల విమానాల నిర్మాణం గురించి, సముద్ర ప్రయాణానికి ఉపయోగపడే పెద్ద పెద్ద పడవల వంటి ఓడల నిర్మాణం గురించి, భూమిపై అతి వేగంగా సంచరించే మహా రథాల గురించి యంత్ర శాస్త్రాన్ని వ్రాశాడు.
       అగస్త్య మహర్షి
     ----------------------
అగస్త్య మహర్షి భూమి, విద్యుత్, సౌరశక్తి, అగ్ని శక్తి మొదలైన శక్తుల గురించి శక్తి శాస్త్రాన్ని వ్రాశాడు
        అత్రి మహర్షి
      --------------------
అత్రి మహర్షి ఆకాశంలోని పరివర్తనలు, మేఘాల చలనాలు, వర్షాలు, మెరుపులు, పిడుగులు మొదలైన వాటి గురించి వాతావరణం శాస్త్రం రాశాడు.
       విశ్వామిత్ర మహర్షి
     ----------------------------
విశ్వామిత్ర మహర్షి రకరకాల అస్త్రాలు, ప్రయోగించే విధానం, దీక్ష, సంగ్రహం, సిద్ధాంత ప్రయోగం అనే నాలుగు విభాగాలుగా రకరకాల ఆయుధాల నిర్మాణం గురించి వ్రాశాడు.
      అశ్వినీ కుమారుడు
    ----------------------------
అశ్విని కుమార్ మహర్షి రసశాస్త్రం గురించి, వ్రాశారు. ఘన పదార్థాలను ద్రవీకరించడం, ద్రవపదార్థాలను ఘనీకరించడం, బంగారం వెండి రాగి మొదలగు లోహాల గురించి వివరించాడు.
       భరతముని
     -----------------
భరతముని సంగీతం, నృత్యం మొదలైన గాన నాట్యాలను వివరించే గంధర్వశాస్త్రాన్ని వ్రాశాడు.
          కశ్యప మహర్షి
         ---------------------
కశ్యప మహర్షి ఇనుము మొదలైన లోహాలను ఉపయోగించకుండా బవంతులు, వంతెనలు తయారు చేయడం, శిల్పాలను ఎక్కడ వాటి కొలతలు మొదలైన అంశాల గురించి వ్రాశాడు.
       వాల్మీక మహర్షి
      ----------------------
వాల్మీకి మహర్షి అక్షర లక్షలు అనే సర్వశాస్త్రం రాశాడు. దీనిలో సర్వశాస్త్రాలు ఉన్నాయి. గణిత శాస్త్రం, ఖనిజ శాస్త్రం, భూగర్భ శాస్త్రం, వాతావరణ శాస్త్రం మొదలైన వెన్నో ఇందున్నాయి.
          ఈ ఋషులే కాక, ధన్వంతరి, అగ్నివేషుడు, అత్రి భరద్వాజాదులు వైద్యశాస్త్రం వ్రాశాడు. వృక్షాలు, లతలు, మొక్కలు మొదలైన వాటి గురించి, వాటి ఉపయోగాలు గురించి వ్రాశాడు.
సుకేషముని --------పాకశాస్త్రం రాశాడు.
వాత్సాయనుడు-------రత్న శాస్త్రాన్ని రాశాడు.
మతం గా ఋషి-------యోచన శాస్త్రం గురించి రాశాడు
ఆర్యభట్టు--------"సున్నా "ను కనుక్కొని గణిత శాస్త్రాన్ని సులభతరం చేశాడు.
      ప్రాచీన మహర్షుల శ్రమ ఫలితాన్ని మనము ఇప్పుడు ఎంతో హాయిగా అనుభవిస్తున్నాము.
ఈనాడు మనం అనుభవిస్తున్న సుఖాలన్నీ వారి త్యాగాల ఫలితంగా మనందరికీ లభించినవే.

కామెంట్‌లు