నిన్ను చూసినాకా:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.:సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
]మొదటిసారి నిన్ను చూసినాకా
నే ఉండలేక వ్రాస్తున్నా ఈ లేఖా
నీ గమకాలను నేను మరువలేకా
ఎలా బ్రతికేది నేనింకా ఓ నా సఖా!

నీ జ్గాపకాలలోనే మునిగి తేలుతున్నా
నీ జతను వీడలేక కలతచెందుతున్నా
నీ ముద్దూమురిపాలనూ మరువలేకపోతున్నా
నా నిద్దురలోగూడా నిన్నే తలచుకుంటు లేస్తున్నా !

నా గుండే గదిలోనా గూడు కట్టుకొనీ ఉన్నావు
జన్మజన్మలకు నా దానివనే అన్నావు
నాకు దూరమై మరి నీవెందుకిలా ఉన్నావు?
నీవు లేని జీవితం వ్యర్థం చేసుకోకు అపార్థం !

నీవే నా సఖుడవు కావాలని నే ఆశిస్తున్నా
నీ తలపుల ఊహలతో నే జీవిస్తున్నా
మరో జన్మంటూ ఉంటే నీ సతి పాత్రను పోషిస్తా
అలా జరగాలని ఆ దేవుని నే పూజిస్తా !


కామెంట్‌లు