ఉండాలోయ్! జీవితము:- --గద్వాల సోమన్న ,99664146
రాలలాగ గట్టిగా
పూలలాగ తావిగా
ఉండాలోయ్! జీవితము
పాలలాగ తెల్లగా

పాటలాగ హాయిగా
ఊటలాగ తీయగా
ఉండాలోయ్! జీవితము
కోటలాగ గొప్పగా

నవ్వులాగ సొగసుగా
గువ్వలాగ స్వేచ్చగా
ఉండాలోయ్! జీవితము
దివ్వెలాగ కాంతిగా

వెన్నలాగ మృదువుగా
వెన్నెల్లా చల్లగా
ఉండాలోయ్! జీవితము
వెన్నెముకలా బిగుతుగా

మొక్కలాగ ఒద్దికగా
ఉక్కులాగ దృఢంగా
ఉండాలోయ్! జీవితము
చుక్కల్లాగ చక్కగా


కామెంట్‌లు