చిన్నారులే ముఖ్యము:- --గద్వాల సోమన్న ,9966414680
పసి పిల్లల హృదయాలు
పవిత్రమైన ఆలయాలు
వారితో కోలాహలం
కళకళలాడు సదనాలు

వారుంటే ఆనందము
గుండెల్లో ఆహ్లాదము
క్రమశిక్షణతో పెంచిన
అభివృద్ధినొందు దేశము

బాలలే దేశానికి
ముఖ్యులే అభివృద్ధికి
లేకపోతే లోకము
వికసించుట దుర్లభము

ముసిముసి నవ్వుల బాలలు
కాంతులీనే భానులు
బాధ్యతగా పెంచాలి
సంస్కారము నేర్పాలి


కామెంట్‌లు