గమనిస్తే గొప్ప వారు:- --గద్వాల సోమన్న ,9966414680
గళంలోన గాయకులు
బలంలోన తెలివిపరులు
గమనిస్తే గొప్ప వారు
కలంలోన కవీంద్రులు

చెలిమిలోన చిన్నారులు
ఇలలోన శ్రీమంతులు
గమనిస్తే గొప్ప వారు
పొలంలోన హాలుకులు

గుణంలోన  బహు శ్రేష్టులు
జనంలోన మహా ఘనులు
గమనిస్తే గొప్ప వారు
ప్రేమలోన కన్నవారు

మనసులోన కడు శుద్ధులు
జగతిలోన మహనీయులు
గమనిస్తే గొప్ప వారు
వారికెవరు సాటి రారు


కామెంట్‌లు