అక్షరాన్ని
అవలీలగా
ఒడిసిపట్టుకుంటావ్!
అనంతమైన -
నీప్రేమను ,
అందరికీపంచుతావ్ !
నాట్యమంటే నెమలివై
పురివిప్పుతావ్ ....!
సంగీతమంటే -
చెవికోసుకుంటవ్!
సాంస్కృతిక కార్యక్రమాల్లో
చురుగ్గా పాల్గొంటావ్ ...!
స్నేహశీలివి -
బంధుప్రేమివి నువ్వు !
చదువంటే ---
అదురులేదు -బెదురులేదు ,
సునాయాసంగా -
నెగ్గుకొస్తావ్ .........!
సున్నితమైయిన
మనసు నీది ......!
కానీ......
తొందరపాటు
తప్పుసుమా ......!!
***
(మనవరాలు బేబి ఆన్షీ...కి,పుట్టినరోజు..24/01/25 శుభాకాంక్షలతో....తాతయ్య-కె.ఎల్వీ.)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి