అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం ఇలా ఎన్నో ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. సీసీటీవీ కెమెరాలు, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వేదికగా వైరల్ అవుతున్నాయి. అయినా ప్రజలలో మాశ్ర్పు రావడం లేదు.ఈ మధ్య కాలంలో యువత బైక్ లపై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ అనేక ప్రమాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తుండటం అత్యంత ఆందోళనకరమైన విషయం.అతివేగం అనర్థదాయకం వంటి బోర్డులను రాష్ట్ర రవాణా శాఖ వారు ఎన్ని పెట్టినా వాటిని పెడచెవిన పెడుతూ యువత అత్యంత వాయు వేగంతో తమ మోటార్ బైక్‌లను నడుపుతూ పలు ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీనితోపాటు వేగ నిబంధనలను అతిక్రమించదం,సెల్ ఫోన్ డ్రైవింగ్, ముగ్గురు, నలుగురు ప్రయాణించడం వంటివి సర్వ సాధారణమైపోయాయి. ఇటువంటి విన్యాసాల వలన అటు వారి ప్రాణాలను ప్రమాదపు అంచుల్లోకి తీసుకుపోవడమే గాక ఇటు రోడ్డు మీద నడిచే పాదచారులను, వాహనాలపై ప్రయాణించే ఇతర వాహనదారుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టి వేస్తుండటం శోచనీయం.రోడ్డు ప్రమాదాల్లో ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పిల్లలకు ట్రాఫిక్ నిబంధనల గురించి చిన్నప్పటి నుంచే నేర్పించాలి. జీవితం యొక్క విలువను మరియు దానిని ఎలా కాపాడుకోవాలో వారికి నేర్పించాలి. పైగా ఓకే బైక్‌పై ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు ప్రయాణం చేస్తూ తమ ఇష్టం వచ్చిన రీతిలో సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. అటు వారి ప్రాణాలను ప్రమాదపు అంచుల్లోకి తీసుకుపోవడమే గాక ఇటు రోడ్డు మీద నడిచే పాదచారులను, వాహనాలపై ప్రయాణించే ఇతర వాహనదారుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టి వేస్తుండటం శోచనీయం. పోలీసు శాఖ వారు ఎంతో నిఘా పెట్టి ఈ యువత వేగానికి చెక్ పెట్టేలా వారి నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నా వారిపై క్రమశిక్షణ చర్యలు ఎన్ని తీసుకుంటున్నా పరిస్థితిలో పెద్దగా మార్పు కానరావడం లేదు.
అంతేగాక, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తుల కోసం ప్రభుత్వం మరింత కఠినమైన చట్టాలను ఆమోదించాలి. లింగంతో సంబంధం లేకుండా ఈ చట్టాలను ఉల్లంఘించినట్లు తేలినప్పుడు వారు వ్యక్తులకు భారీగా జరిమానా విధించాలి లేదా కఠిన చర్యలు తీసుకోవాలి.డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్‌లను ఉపయోగించకుండా తల్లిదండ్రులు చిన్నవారికి ఆదర్శంగా ఉండాలి. అలాగే ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు హెల్మెట్‌లు, సీటు బెల్టులు తప్పనిసరిగా ధరించాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి