భృగుమహర్షి!:- అచ్యుతుని రాజ్యశ్రీ

 భృగుసంహిత సంస్కృతజ్యోతిష గ్రంథకర్త ఆయన. భృగువు భాగ్యదేవత భార్గవి తండ్రి.ఓసారి ఓఅసురుడు ఆయన భార్యపులోమను 
 ఎత్తుకుపోతుంటే ఆమె గర్భంనుంచి చ్యవనుడు బైట పడినతర్వాత ఆదానవుడు చనిపోయాడు.పులోమకి రక్షణ గా కాపలా కాయలేదనే కోపంతో అగ్నిని శపించాడు మహర్షి" నీవు అంతా నష్టం చేస్తావు.భస్మంచేస్తావు" అని. భృగువు ఇంకోభార్య ఖ్యాతికి మృకుండమహర్షి పుట్టాడు. మృకండుడు తామరపూల కాడలపోగులతో వస్త్రం తయారుచేసిన ఘనత మృకండునిదే! భృగువు మరొక భార్య  కావ్యమాతకి శుక్రాచార్యుడు పుట్టాడు. ఈకావ్యమాత వెనకాల ఓదానవుడు దాక్కున్నాడు.వాడ్ని చంపటంలో కావ్యమాత శిరస్సుతెగిపోయింది. శుక్రాచార్యుడు విష్ణుని శపించాడు.పరశురామ రామ కృష్ణ రూపాల్లో విష్ణువు మానవునిగా అవతరించాడు. భృగువు వల్ల భార్గవవంశం వచ్చింది.నిద్రపోతున్న విష్ణువుని లేపటానికి ఆయన కుడిభాగంపై తన్నటంతో లక్ష్మి కోపంతో భువిపైకి వచ్చింది.ఆమె కమలంలో జననమంది భృగువుచేత పెంచబడటంతో పద్మావతి భార్గవి అన్నారు.తిరుపతి వెంకన్న కథ మనందరికీ తెల్సిందేకదా🌹
కామెంట్‌లు