ఆ అడవిలో కుందేలు నడుచుకుంటూ వెళ్తుంది. ఎదురు పడ్డ తాబేలు "మిత్రమా క్షేమమా?" అని అడిగింది. "అసలు నువ్వెవరివి నా క్షేమ సమాచారాలు తెలిసుకోవడానికి? మనిద్దరికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా" అన్నది కుందేలు. "వెనుకటికి తాబేలు నీతో పరుగు పందెం కాసి, గెలిచింది తెలుసా?" అన్నది చెట్టు మీద రామచిలుక. "ఆ సోమరిపోతు కుందేలు ఒక్క దాని వల్ల మొత్తం కుందేలు జాతిని అవమానించడన సరి కాదు. ఈ సోమరిపోతు కుందేలుతో స్నేహమా? నక్కకు నాగ లోకానికి ముడి పెట్టవద్దు." అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది.
తాబేలు చుట్టూ చూసింది. "చేతనైతే నాతో పరుగు పందెం కాయి. మరల నువ్వు ఓడిపోవడం ఖాయం. మనిద్దరికీ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా అన్నావు కదా! నువ్వు నన్ను ఎంత చిత్తుగా ఓడిస్తావో పందెం. ఈ రామచిలుక సాక్ష్యం. " అన్నది తాబేలు. ఈ తాబేలును చిత్తు చేసి, దీని పొగరు అణచాలని కుందేలు అనుకుంది. తక్షణం మెరుపు వేగంతో పరుగెత్తి అందరానంత దూరానికి వెళ్ళింది.
ఆ తర్వాత రామచిలుక ఎగురుతూ వెళ్ళి కుందేలును చేరుకుని "తాబేలు మరల గెలిచింది. " అన్నది. "ఎలా?" అన్నది సింహం. "నీతో మాట్లాడుతున్న సమయంలో సుదూరంగా ఉన్న సిం సింహ గర్జన విన్నదట. ఆ శబ్ధం నువ్వు మాటల్లో పడి సరిగా వినలేదు. నిన్ను రక్షించాలనే ఆలోచనతో తాబేలు పరుగు పందెం కాసి, నిన్ను రెచ్చగొట్టింది. నువ్వు క్షేమంగా బయట పడ్డావు." అన్నది రామచిలుక. అప్పుడు కుందేలు ఇలా అన్నది. "తాబేలు మళ్ళీ గెలిచింది."
తాబేలు మళ్ళీ గెలిచింది : సరికొండ శ్రీనివాసరాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి