చేయి వీడిన చెలిమి తలచి
వేయి తడవలు వగచి నిలిచి
రేయి మొత్తం రెప్ప వేయక
రాయిగా మారిన మనసు కరిగేలా...
రాలి నలిగిన కుసుమానికి
మేలి సాయము దొరికినట్టు
జారి పగిలిన హృదయానికెవరో
కోరి కలిసి ఊరట నిచ్చినట్టు
మాట తగిలి రగిలిన గుండెకు
తేట తేనెల పూత పూసినట్టు
వాడి.. వన్నెలు కోలుపోయిన
మోము పైన చిన్ని నవ్వు విరిసినట్టు
ఒంటరైన మదికి వద్దకొచ్చి
జంట కలిసిన కొత్త నేస్తంలా
బహుదూరపు బాటసారికి
సహచరులు దొరికినట్టు...
నడిసంద్రాన దిక్కుతోచక
వడికి భయపడి నిలుచున్న
నావకేదో దూరాన మిణుకుమని
దారిదీపమ్ కనపడినట్టు....
కోరిన వేకువ వచ్చే తరుణం
వేడిన వరములు ఇచ్చే దైవం
నింగిని వెలిగే బంగరు రూపం
పొంగిన మనసున వెలిగే దీపానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి