పాండవులంటే మనందరికీ తెలుసు.కానీ ఉపపాండవులు ఎవరు అంటే చెప్పటంకష్టం.ద్రౌపది కి ప్రతి వింద్యుడు శృతసోముడు శ్రుతకర్ముడు శతానీకుడు శ్రుతసేనుడు అనే 5గురు కొడుకులు పరాక్రమవంతులు. కురుక్షేత్రయుద్ధంలో వీరోచితంగా పోరాడారు. అశ్వత్థామ రాత్రిపూట నిద్ర పోతున్న వీరిని అధర్మంగా చంపాడు. దానికి కారణం పూర్వజన్మ శాపం.మార్కండేయపురాణంలో ఆకథ ఉంది.పూర్వజన్మ లోవీరు విశ్వే అనబడే దేవతలు.సత్య హరిశ్చంద్రుని బాధలుపెడ్తున్న విశ్వామిత్రుని క్రూరత్వం గూర్చివారు "ఈయన నరకానికి పోతాడేమో?" అని చర్చించుకునే సమయంలో విశ్వామిత్రుని చెవిన పడి కోపంతో శపించాడు" భూలోకంలో పుట్టి పెళ్లిపెటాకులు పిల్లాజెల్లలేకుండా జీవిస్తారు. దైవ కార్యం ముగిశాక దేవతలవుతారు".చంద్ర వంశరాజు సంకృతి. ఆయన కొడుకు రంతిదేవుడు దానదయాశీలి.సకలశాస్త్రపారంగతుడు నిగర్వి .దానధర్మాలతో దైవ స్మరణ లో కాలంగడిపాడు.ఒకసారి కరువు వచ్చి అంతా అలమటిస్తుంటే రంతిదేవుడు 48రోజులు ఏమీతినకుండా అందరికీ దానంచేశాడు. ఒక రోజు దేవుని ప్రసాదం నోట్లో వేసుకోబోతుండగా ఆకలిఅంటూ వచ్చిన బ్రాహ్మణునికి శునకాలతో వచ్చిన వాడికి ఇచ్చేసి దైవ స్మరణ చేస్తున్న రంతిదేవుని భక్తికి మెచ్చిన బ్రహ్మాది దేవతలు ప్రత్యక్ష మై ఏదైనా వరం కోరుకోమన్నారు. లౌకిక సుఖాలు సంపదలు తృణీకరించి విష్ణుసాయుజ్యం పొందాడు.రామాయణంలో వాలిసుగ్రీవులను గూర్చి మనకుతెలుసు.కానీ వాలి అన్న మహాబలవంతుడు రావణునికూడా జయించిన వాడు.వీరిద్దరి పుట్టుక విచిత్రంగా ఉంటుంది.బ్రహ్మ కంటినుంచి నీటిబొట్టు జారి కింద పడి కోతిరూపంగా మారింది.ఆవానరంపేరు ఋక్షవిరజుడు. ఆయన మేరుపర్వతం దగ్గర ఉన్న కొలనులో స్నానంచేయటం ఆడకోతిగా మారడం జరిగింది.ఆకొలనుకి ఉన్న శాపం సంగతి ఆయనకి తెలీదు.సూర్యుడు ఇంద్రుడు మోహములో పడ్డారు.ఇంద్రుని తేజస్సు ఆకోతి తోకపై పడి వాలి పుట్టాడు.సూర్యుని తేజస్సు కోతి మెడపైన పడి సుగ్రీవుడు పుట్టాడు.రాముని చేతిలో వాలి చస్తే సుగ్రీవుడు ఆయన మిత్రునిగా సీతాన్వేషణలో సాయంజేశాడు.🌹
తెలుసుకుందాం! :- సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి