స్పర్శ : - శ్రే దేవి.వేమవరపు.

 ఔను  !!  నువ్వే  !!
నాన్న వెనుక దాక్కుని …
ఇంతలేసి కళ్ళతో చూస్తూ …
చిరునవ్వుతో  పిలవగానే …
బెరుకుగా దగ్గరకు వచ్చింది ..??
నీచేయందుకుని  నా చేత్తో 
పలక మీద అక్షరాలు దిద్దిస్తుంటే ….
గులాబీలంత సుకుమారం 
నీ  “ స్పర్శ  “ లో …….      
పెద్ద చదువులకని …
బడినీ ,నన్నూ విడిచి వెళ్తూ…..
దుఃఖం తో చుట్టేసుకున్నప్పుడూ ..
అదే  సౌకుమార్యం ..
నీ  “ స్పర్శ  “లో ……
ధవళ వస్త్రాలలో 
మెరిసిపోతూ …
వైద్యురాలిగా సేవలందిస్తూ ….
నువ్వు నన్ను తాకగానే …
నీ ప్రతిభ ..నీ దీక్ష ..
అనుభవ చాతుర్యం …
నీ  “ స్పర్శ “ లో …
పదవీ విరమణ  అనంతరం …
నీ వలెనే ఎందరో 
విజ్ఞాన ఖనులు గా 
దర్శనమిచ్చినప్పుడూ….
మా టీచర్ అంటూ …
సమీపించినప్పుడూ …
అంతే లేని  ఆనందం 
నా హృదయం లో  !!
             ***
కామెంట్‌లు