గర్వకారణం బాలిక:- కొప్పరపు తాయారు
పుట్టినప్పుడే తేడాలండోయ్
పుట్టగానే ఆడపిల్లని జవాబు
ఆడ అనగానే దూరమే కదా!
  
ఆశల బ్రతుకుల వంశోద్ధారకుడని            
ఇచ్చారండి ప్రథమ స్థానం నాడు!!
 కానీ పూజించేది మనం ఎవరినీ?
 అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల
         
 మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మ !!
 అందుకే స్త్రీ మూర్తి ఆదిపరాశక్తి!!!
మనం మాతృభూమి అని అంటా
అమ్మని గౌరవిస్తూ అమ్మని
పూజిస్తాం          

విద్యలలోఉన్నతులు,కళలలోఅగ్రగణ్యులు
అమృతముమొలకించు, ఆదిరూపాలు!!
 దేనిలో తక్కువ బాలికలు, నేతలు
అన్ని విద్యలలో అందెవేసిన చేయి

అందనంత ఎత్తు ఎదిగిన మహోన్నతులు
 చదువు లేక సాధ్యమా? రాజ్యాలతోమొదలై 
రణ రంగాన అధికులై ఆలోచనా సరళిలో 
ఉన్నతులై, సర్వత్ర ఉన్నత మైన స్తానాలే !!

అందుకే నేటి బాలికలు రేపటి వెలుగులు
దివ్య స్వరూపాలు, నేర్వగలేని విద్య లేదు
 నేర్చుకోగలరు, చేపట్టని పదవి లేదు
ఎదుగుతూనే ఉంటారు చాకచక్యం కలవారు
అందరూ విద్యాధికులు అవుతారు
ఇది సత్యం, ఇది సత్యం నిత్యం!!!


కామెంట్‌లు