అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు అభినయశ్రీ వాళ్ళ నాన్న పేరు రాము. ఒకరోజు అభినయ బడికి వెళ్ళింది. ఇంకా వాళ్ళ నాన్న పొలం పనికి పోయాడు. ఆ తరువాత వాళ్ళ నాన్న పొలం పని పూర్తి చేసి ఇంటికి వచ్చాడు. అప్పుడే బడి నుండి ఫోన్ వచ్చింది. పోన్ రాగానే ఫోన్ తీసి మాట్లాడాడు. ఆ తరువాత వాళ్ళ కూతురు వెళ్లిన ఆ బడి వ్యాన్ ఆగిపోయింది అని చెప్పగానే వాళ్ళ నాన్న ఆలోచిస్తూ కూర్చున్నాడు అప్పుడే బయట ఎవరో వచ్చి పిలుస్తున్నట్టే విని బయటకు వెళ్లి చూడగానే ఆ వ్యాన్లో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు కనిపించారు, వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు. ఇక ఇలా కూర్చుంటే ఏ పని కాదు అని అనుకున్నాడు. బయట ఉన్న కారులో వెనక ఉన్న టైరు పంచారు అయ్యి ఉంది. మళ్ళ అక్కడ ముందు చూడగానే ఆటో కనబడింది. ఆటో దగ్గరికి వెళ్లి చూస్తే దాంట్లో డీజిల్ లేదు. మళ్ళా పెద్ద బండి దగ్గరకు వచ్చి చూస్తే బానే ఉంది కానీ స్టార్ట్ అవుతాదో అవ్వదో అని అనుకుంటూ ఆ బండి దగ్గరకు వెళ్ళాడు. దగ్గరకు వెళ్ళగానే ఆ బండిలో కూర్చుని స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లేదు అని బండిలో నుంచి దిగాడు. ఆ తరువాత ఒక ఆటో ఆయన పోతుంటే అభినయశ్రీ వాళ్ళ నాన్న వాళ్లను ఆపి కొంచెం బండి నెట్టుదాం రావా కొంచెం అని అడిగాడు. అడిగిన తర్వాత ఆయన వచ్చి బండి నూకాడు నొక్కిన తర్వాత ఆ బండి స్టార్ట్ అయింది ఆ బండి స్టార్ట్ అవ్వగానే ఇగ అక్కడి నుంచి అక్కడికే వెళ్లిపోయాడు ఆ తరువాత అభినయ శ్రీ వాళ్ళ నాన్న అక్కడికి వెళ్ళగానే అక్కడ ఎనిమిది మంది మిగిలారు ఆ ఎనిమిది మంది ని తీసుకొని వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటికి తోలి వచ్చాడు ఆ తరువాత తన కూతురిని తో ఇంటికి తీసుకువచ్చాడు.
ఈ కథలోని నీతి :ఎప్పుడైనా మనమే గెలవాలి అని అనుకుంటే సరిపోదు అది సాధించి చూపియ్యాలి అప్పుడు మనం అనుకోవాలి మనం గెలిచామని. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఒక పేరు ఊరు లేని జీవితాన్ని ఒక మంచి జీవితాన్ని ఇచ్చారు అని మాట .
ఒక నాన్న పిల్లల కథ:- షేక్ జుబేరియ-ఆరవ తరగతి-ఆదర్శ పాఠశాల వల్లాల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి