తెలుసుకుందాం! సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 కాశీలో జ్యోతిర్లింగం తొలిది . కాశ అనే రాజు పాలించిన నగరం.కాశతి అంటే ప్రకాశించేది అని అర్థం.వరుణ అశి అనే రెండు నదులు ఇక్కడ గంగానదిలో కలుస్తాయి కనుకనే వారణాశి అనే పేరొచ్చింది. ఆంగ్లేయులకాలంలో బెనారస్ ఐంది.వారణాశి కాశీ లో మరణిస్తే పుణ్యం అని నమ్మకం.కాళిఘటా కాస్తా కలకత్తా కోల్ కత్తా ఐంది.శిబి చక్రవర్తి ఇక్ష్వాకువంశానికి చెందినవాడు. ఆయనదయ దానగుణం అందరికీ తెలుసు.ఆకథని కైకేయి భర్త కి చెప్పి" నాధా! ఆడినమాట తప్పకు. నారెండువరాలు ప్రసాదించి ధన్యుడివి కమ్ము" అని హెచ్చరిస్తుంది. తన నేత్రాలు దానంచేసిన అలర్క మహారాజు కథకూడా చెప్పిందామె.శ్రీరంగం  శ్రీరంగపట్టణం రెండు ప్రాంతాలు.తమిళనాడులో కావేరీ తీరాన తిరుచ్చి సమీపంలో శ్రీరంగం పుణ్య క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది.మైసూర్ కి దగ్గర శ్రీరంగపట్టణం ఉంది.హైదరాలీ టిప్పుసుల్తాన్ ల రాజధాని.విజయనగరరాజులు శ్రీరంగపట్టణం కోటను నిర్మించారు.నరసింహ స్వామి  గంగాధరేశ్వర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి.🌹
కామెంట్‌లు