శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలలో సావిత్రి భాయి ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సావిత్రి భాయి ఫూలే జయంతిని, రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయినిలందరిని సన్మానించి, గౌరవించారు, ఈ కార్యక్రమంలో సావిత్రి భాయి ఫూలే చిత్ర పటాన్ని చిత్తలూరి సత్యనారాయణ గారు పాఠశాలకు బహుకరించి పూలమాలతో సన్మానించారు, ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి మరియు మహిళా విద్యా సాధికారిత కోసం ఎన్నో త్యాగాలు చేసిన సావిత్రి భాయి ఫూలే దంపతులను స్పూర్తిగా తీసుకొని ఈనాటి సమాజం ముందుకు సాగాలని హితవుపలికారు,ఈ కార్యక్రమంలో ఈరోజు పాఠశాల ఇంచార్జీ సంధ్యారాణి గారు మరియు కుక్కడపు శ్రీనివాసు,సంపత్ కుమార్, దామెర్ల కృష్ణయ్య, కేతేపల్లి శ్రీను, శ్రీరాములు, సంగీత, సంధ్య, అనురాధ, సృజన, స్వప్న, మల్లేష్, ఆంజనేయులు, యూనుస్, రవి,సహన, సరస్వతి,రాధ, సువర్ణ, పావని, రాజు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి