తెలుసుకుందాం!:- సేకరణ.. అచ్యుతుని రాజ్యశ్రీ

 అయోధ్య నుంచి వైవస్వత మనువు నిర్మించాడు.ఇతను సూర్యుని కొడుకు.ఆయనభార్యశ్రద్ధ.గురువు వశిష్ఠుడు.మనువు‌ తన బాణాన్ని వదిలితే‌అది హిమాలయ పర్వతాలలోని‌మానససరోవరం చేరింది.దాన్ని అనుసరించి ఒక నది అయోధ్య కు ప్రవహించింది.శరం అంటే బాణం వల్ల వచ్చిందని దానికి శరయూ‌అనేపేరు వచ్చింది.క్రమంగా సరయు గా పిలువబడుతోంది.విశ్వామిత్రుడు కోపిష్టి స్వార్థపరుడుగా భావిస్తాం.కానీ కొన్ని విషయాల్లో ఆయన జాలి గుండె కలవాడు.అంబరీషుని యజ్ఞం కోసం బలి కాబోతున్న శునశ్శేపుని కాపాడుతాడు.ఎలాగో చూద్దామా?" నాయనా! నేను చెప్పే మంత్రాలు నిష్ఠగా జపించు.నీకు ఏఆపద రాదు" అని మంత్రోపదేశం చేశాడు.శునశ్శేపుని యూపస్థంభానికి కట్టేస్తే ఆపిల్లాడు అగ్ని ఇంద్ర విష్ణు స్తోత్రం చదివితే వారు అనుగ్రహించారు.అంబరీషునికి ఫలం దక్కింది.మనకు వేంకటేశ్వర ‌‌సుప్రభాతం బాగా తెలుసు.రేడియో గుడిలో వింటాం.కానీదాన్ని ఆశువుగా చదివి మనకు అందించారు మహానుభావులు శ్రీ ప్రతివాది భయంకరంఅణ్ణన్.క్రీ.శ.1361 లో కంచికి సమీపంలోని తిరుత్తణ్కా అన్న చోట ముడుంబై వంశంలో జన్మించారు.కాంచీపురంలో సర్వశాస్త్రాల్లో పారంగతులైనారు.ఆయన గురువు శ్రీరంగం లో ఉన్న శ్రీ వరవరమునులు.తిరుమలలో ఏడుకొండల వాడి దర్శనం చేసుకుని స్వామిపై అలవోకగా ఆశువుగా వసంతతిలకవృత్తంలో అణ్ణన్ స్వామి  సుప్రభాతం చదివారు.అప్పటినుంచీ ఇదే పవిత్ర స్తోత్రం గా విశ్వవ్యాప్తం ఐంది.దధీచి మహర్షి తల్లిదండ్రులు సుకన్య చ్యవనుడు.క్షుపు అనేరాజు దధీచిని అసూయ ద్వేషాలతో ముక్కలు గా ఖండిస్తాడు.శుక్రాచార్యుడు మృతసంజీవనీ విద్య తో దధీచిని బ్రతికిస్తాడు.శివ విష్ణు అనుగ్రహం తో ఆయన వరాలు పొందాడు.దేవతలు తమ ఆయుధాలను దధీచి దగ్గర దాచే వారు.ఆయన తన శరీరంలో భద్రపరిచారు.అవి శరీరంలో కల్సి పోయాయి.దేవతలు తమ ఆయుధాలను తిరిగి ఇవ్వమని అడిగితే దధీచి యోగవిద్య తో చనిపోయారు.అప్పుడుఇంద్రునికి వజ్రాయుధం విష్ణువుకి సుదర్శన చక్రం దేవతలకి వారి వారి ఆయుధాలు లభించాయి.మహర్షి త్యాగం నిస్వార్థం నిజాయితీ అందరికీ ఆదర్శం 🌹
కామెంట్‌లు