అమ్మ , నాన్న ఇద్దరు డాక్టర్లు బాబు చదువుల కోసం విజయవాడ సమీపంలోని పాఠశాలలో చేర్పించారు. కానీ అమ్మ మనసు బాబు మీదనే. ఏం చేయాలి. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా . అందుకే ప్రతి వారం కొడుక్కి ఉత్తరం రాయడం ప్రారంభించింది. 2014 నుంచి 2019 వరకు ఈ ఉత్తరాలు కొనసాగాయి. అవన్నీ కేవలం ఆత్మీయతనే కాదు. విజ్ఞానాన్ని నింపి కొత్త ఆలోచనలకు పదును పెట్టాయి. ప్రతి తల్లి తన కొడుకు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటుంది. కానీ అందుకు తాను ఏం చేయాలో అర్థం కాదు. ఈ తల్లి వృత్తి రీత్యా పని ఒత్తిడి ఉంటుంది. కానీ తన కొడుకు కోసం ఎంతో అధ్యనం చేసి దాన్నంతా రంగరించి ఉత్తరాల్లో నింపింది . ఒక్కో ఉత్తరం జ్ఞాన బాండాగారంగా మారింది. ఈ రోజుల్లో సెల్ ఫోన్ సమయమంతా తినేస్తుందన్న తరుణం లో ఉత్తరం ఆలోచన కొత్త దారులు చూపించింది . అమ్మ నుంచి వచ్చిన ఉత్తరం కొత్త ఉత్హేజాన్ని అందిస్తుంది. మళ్ళీ వారం కోసం వచ్చే ఉత్తరం కోసం ఎదురు చూసేలా చేస్తుంది. ఆ బాబు ఉత్తరాన్ని పదే పదే చదువుతో దిండు కింద పెట్టుకునే వాడు. తన మిత్రులకు చూపించే వాడు. ఆ ఉత్తరాల వరదలో అందరూ ఈదుతూ పునీతులయ్యారు . అమ్మ పేరు డాక్టర్ విజయ లక్ష్మి నాఅన్న డాక్టర్ కె. శివ బాబు. ఇద్దరు జహీరాబాద్ లో వుంటారు. బాబు పేరు ప్రకాశ్ . విజయ వాడ లోని కానూరు పాఠశాలలో చదివాడు. వీరి మధ్య ఆరేళ్ళ పాటు ఉత్తరాలు పలుకరిస్తుండేవి. వాటన్నిటికీ " చిన్నోడికి ప్రేమతో " అన్న పేరుతో పుస్తక రూపం ఇచ్చారు. ఆ ఉత్తరాలన్నీ మనమూ చదువొచ్చన్న మాట. ఈ పుస్తకం వెల :250 రూపాయలు. హైదరాబాద్ లోని అన్ని పుస్తకాల దుకాణాల్లో దొరుకుతుంది.
అమ్మ ఉత్తరాలు : " చిన్నోడికి ప్రేమతో ...": -టి. వేదాంత సూరి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి