అనుబంధం :-డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 బ్రతుకుతో 
భవిష్యత్తుతో 
ముడిపడిఉన్న 
బంధాలు --
అనుబంధాలు ,
బ్రతికినంతకాలం ,
జ్ఞాపకాలై ..మదిలో
నిలిచిపోవాలి ....!
నాకయితే 'బి.డి.ఎస్ .'
కట్టబెట్టిన అనుబంధం ..
ఏమిటో...తెలుసా....!
గౌలిగూడలో--
మిత్రులతో అద్దెగది,
ఉస్మానియా మెడికల్ కాలేజీ-
డైనింగ్ హాల్....
ఉస్మానియామెడికల్ కాలేజి,
కోటి -అఫ్జల్ గంజ్ -
డబుల్ డెక్కర్ ,
పాత డెంటల్ కాలేజి,  
ఉస్మానియాఆసుపత్రి,
ఈనేపద్యంలో....
ఎన్నో ..అనుభవాలు ...
అనుభూతులు.....
ఎన్నని చెప్పగలం !
ఎంతని వర్ణించగలం....!!
              ***

కామెంట్‌లు