తెలుసుకుందాం! సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

 సైన్స్ టెక్నాలజీ పెరిగింది.లింగమార్పిడి చికిత్సలు కృత్రిమ పద్ధతుల్లో శిశుజననం నేడు సామాన్యమైనది.అసలు ఈవిషయం తెల్సుకుంటే మనం ఆశ్చర్యపోతాం. మాంధాత రాజు తండ్రి గర్భంలోంచే పుట్టాడు.ఇక్ష్వాకు రాజైనయవనాశ్వుడు ఆయన భార్య పుత్ర కామేష్ఠి చేశారు సంతానంకోసం.పొరపాటున రాజు మంత్రజలం దాహమేసితాగాడు. భార్య బదులు ఆయన కే గర్భంవచ్చింది.శిశువు పుట్టాడు.ఇంద్రుడు తనబొటనవేలుని ఆపసివాడి నోట్లో పెట్టి చప్పరించేలా చేశాడు మరి తల్లిపాలు లేదుగదా? అందుకే ఆచిన్నారికి మాంధాత అని పేరు పెట్టారు.ముల్లోకాలజయించిన ఆయన కి ముగ్గురు కొడుకులు 50మంది కూతుళ్లు పుట్టారు. వారిలో అంబరీషుడు గొప్ప భక్తుడు.శ్రీకృష్ణజన్మస్థానం అంటే జైలు అని మనందరం అంటాం.ఢిల్లీకి 150 కి.మీ.దూరంలో మధురలో కంసుని చెరసాల ఉంది.దీన్ని గర్భగుడిగా ఉంచారు.చుట్టూతా ఆలయాలు కట్టారు.గర్భగుడిలో విగ్రహం ఉండదు.పెయింటింగ్స్ ఉన్నాయి.ఇద్దరు అన్నమయ్య పేర్లవారున్నారు. ఒకరు పదకవితాపితామహుడు అన్నమాచార్యులవారు. ఇంకొకరు శివ కవి యథావాక్కుల అన్నమయ్య. 13వశతాబ్దానికి చెందిన కవి. శ్రీశైలం దర్శనం చేసుకున్న ఆయన సర్వేశ్వరశతకం రాశాడు.ఒక్కొక్క పద్యంరాసి కృష్ణానదిలో పడేసేవాడు. అది తిరిగి ఆయన దగ్గర కి వచ్చాక ఇంకోపద్యం రాసి నదిలో పడేస్తూ 138పద్యాలు రాశాడు.ఒకపద్యం తిరిగిరాకపోటంతో ప్రాణత్యాగంకి సిద్ధపడ్డాడు. అప్పుడు శివుడు పశులకాపరిగా వచ్చిఆయనరాసిన పద్యం తనకు దొరికిందని చేతికొచ్చాడు. ఆరోజుల్లో అంతా తాళపత్రాలపై రాసేవారు.భక్తితో రాసిన రచనలు కాబట్టే మనకి నేటికీ పఠనీయం 🌷.

కామెంట్‌లు