భీష్ముడు- పితృభక్తి:- కొప్పరపు తాయారు

  భీష్ముడు పిండ ప్రదానం చేస్తూ న్నాడు. మామూలుగా పిండాలు ధర్భల మీద పెడతారు.పళ్ళాలు, ఆకులు వాడరు.
              భీష్ముడు నది వొడ్డున కార్యక్రమం చేస్తున్నాడు.గంగ ఈయన తల్లి.
          ప్రతివ్యక్తి దివంగత పితృఋణం తీర్చ ఈ కార్యం అత్యవసరం . అందుకు తప్పని సరి నిర్వర్తిస్తారు
          భీష్ముడు కూడా తన పితృ భక్తి కై కార్యక్రమం చేస్తూ పిండం ధర్భలపై పెట్టబోగా తండ్రి బంగారు నగలు అలంకరణతో దేదీప్య
మానంగా వెలుగొందే హస్తం
రావడమే కాక ,"నాయనా!  నీకు తగని అన్యాయం చేసిన తండ్రిని ఈవిధంగా నా తప్పు కాచుకునే అవకాశం ఇయ్యవా! అని అర్థించారట" , వెంటనే 
భీష్ముడు తండ్రి కి పిండ దానం చేశారట.
             అందుకే తల్లి తండ్రులు బతికి ఉండగా గౌరవం ఇవ్వడం పూజించడం చేయాలి.ఆ పిల్లలు చేసిన పుణ్యాలు అవి.ఎవ్వరూ మరువ కూడదు.మంచి జరగాలంటే వారి పిల్లలకు మంచి
  భవిత కావాలంటే తల్లిదండ్రులను
   గౌరవించాలి బ్రతికుండగానే...
కామెంట్‌లు