పద్యాలు : -డా. సి వసుంధర,చెన్నై
 కందమ
(1)
పదవికి యధిపతి యనగనే
పదముల నొత్తుదురు 
నీకు పదుగురు విను, నీ!
పదవటు తొలిగిన వారికి 
పెదవుల చిరునగవు కూడ  పేదది కాదే.   
    

ఆట వెలది
    
         ( 2)
పొమ్ము గుడికి, మ్రొక్కి
పూజించు పూలతో 
నమ్ము, మదిని భక్తినాటు కొనగ,
కోర్కె లన్ని గాక
కోదండ రాముని 
 ముక్తి కోరు కొనుము
ముఖ్య మదియె.
కామెంట్‌లు