చీకటి తరువాత వెలుగు
అడుగు వెనకే అడుగు
వేడుక ముగిసేలోగా
వేరొక వేదన మొదలు!
పూలైనా ముళ్లయినా
పయనం మనదే!
చుట్టూ ఎందరున్నా
ఒంటరి బాటసారులం మనమే!
కష్టాలకు భయపడితే
విజయపు రుచి తెలిసేదేలా?
ఎండలో నడవక పోతే
నీడ విలువ తెలిసేదేలా?
సాధించాలనే ఆశయం
సహించే ఓర్పును ఇస్తుంది
గమనంతో కరిగే దూరం
గమ్యాన్ని దగ్గర చేస్తుంది
ఆకులు రాలే శిశిరానికి
ఆమని జవాబవ్వదా?
వణికించే చలిని
వేసవి దూరం చేయదా?
సాహసమే ఊపిరిగా
సహనమే ఆయుధంగా
ఆశే జీవనసూత్రంగా
నడిచి రమ్మనేదే రహదారి!
వెలుగు తెచ్చే కొత్త వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి