ప్రమాదాలు జాగ్రత్త : -టి.రాజేష్-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల-రేగులపల్లి
 అనగనగా ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉండేవారు. వారి పేర్లు రాము, శీను, రాజు, రవి ఈ నలుగురు ఎప్పుడు కలిసి మెలసి ఉండేవారు. ఒకరోజు రాజు  రాము, శీను ,రవిలతో ఇలా అన్నాడు. మనమంతా కలసి చెరువుకు వెళదామా అని .అప్పుడు మిగతా ముగ్గురు మిత్రులు రేపు వెళ్దామని అన్నారు. మరునాడు ఉదయం పాఠశాలకు సెలవు కావడంతో నలుగురు మిత్రులు  చెరువు దగ్గరకు వెళ్లారు. వీరిలో రవి చెరువులోకి దిగాడు రవికి ఈత రాదు ఆ సమయంలో వేగంగా అలలు రావడంతో రవి చెరువులో కొట్టుకపోయాడు అది చూసి శీను గట్టిగా అరిచాడు అప్పుడు రాము ధైర్యంగా చెరువులోకి దిగి రవిని కాపాడాడు.

 నీతి అందుకే పిల్లలు  చెరువులోకి దిగవద్దని పెద్దలు చెబుతారు


కామెంట్‌లు