పల్లెటూరి అవ్వ నుదుటిపై
బొట్టులా.... వెలుగుతూ...
అవ్వ బోసినోటి నవ్వులా
అందంగా మెరుస్తూ..
పల్లెనంతా పరచుకుని
వెలుతురు ముగ్గులేస్తూ..
కునుకు తీస్తున్న గుబుర్లకు
కితకితలు పెడుతూ...
పోగమంచును వెంటపడి
పొలిమేరకు తరిమేస్తూ..
గరికపై నిలుచున్న
హిమబిందువును పలకరిస్తూ..
పొలాల పైరును ఆప్యాయంగా
నిమురుతూ...
పచ్చని పట్టుచీర కట్టి
ముస్తాబైన నేల తల్లిని దీవిస్తూ..
ఆగి చూచే బాటసారికి
ఆనందాల విందు నిస్తూ
అందరికీ బంధువైన
అసమాన బాలునికి...
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి