రామవరం ఉన్నత పాఠశాలలో స్వరూప 9వ తరగతి విద్యార్ధిని. చిన్నప్పటి నుంచి చదివు పక్కన పెట్టి, టి. వి. కి, సెల్ ఫోనుకు బానిసై చదువును నిర్లక్ష్యం చేస్తుంది. తల్లిదండ్రులు స్వరూప చదువు గురించి చాలా బాధ పడుతున్నారు. 9వ తరగతి స్లిన్ టెస్ట్ మార్కులు చూసి, తల్లిదండ్రులు చాలా బాధ పడుతున్నారు. మరోసారి మార్కులు తక్కువ వస్తే చదువు మానిపించి, ఏదైనా పనిలో పెడతాము అన్నారు.
ఆ తరగతిలో మొదటి ర్యాంకు వచ్చే శ్రుతి వద్దకు చేరింది స్వరూప. తల్లిదండ్రులు తనకు చేసిన హెచ్చరిక గురించి చెప్పింది. తదుపరి పరీక్షలలో తనకు జవాబులు చూపించమని బతిమాలింది. కష్టపడి చదివితే ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుందని శ్రుతి చిలక్కి చెప్పినట్లు చెప్పింది. ససేమిరా ఒప్పుకోలేదు స్వరూప. "నీ ఖర్మ " అంది శ్రుతి.
తెలుగు పరీక్ష రోజు శ్రుతి పేపర్ చూసి మక్కికి మక్కి కాపీ కొట్టింది స్వరూప. అదే రోజు సాయంత్రం తెలుగు పేపర్స్ దిద్దింది శ్రావణి టీచర్. తదుపరి రోజు మధ్యాహ్నం జరగబోయే హిందీ పరీక్ష కోసం సిద్దం అవుతున్న 9వ తరగతి పిల్లల వద్దకు వచ్చింది టీచర్. "స్వరూప! మీ అమ్మ పేరు ఏమిటి?" అని అడిగింద టీచర్. "ఆండాలు" అని చెప్పింది స్వరూప. "మీ అమ్మ పేరు చెప్పమ్మా శ్రుతి!" అని అడిగింది టీచర్. "శర్వాణి." అని చెప్పింది శ్రుతి. "అమ్మడూ స్వరూపా! మీ అమ్మ గురించి వ్యాసం రాయమంటే శ్రుతి రాసింది మక్కికి మక్కి కాపీ కొట్టావు. పైగా మీ అమ్మ పేరు శర్వాణి అని రాసినావు." అన్నది శ్రావణి టీచర్. మిగతా విద్యార్థులు ఆపకుండా నవ్వులే నవ్వులు. సిగ్గుతో తల దించుకుంది స్వరూప. "మీ అమ్మా నాన్నలను పిలిపించి, నువ్వు రాసిన వ్యాసం చదివి వినిపిస్తా." అన్నది టీచర్. వద్దని బతిమాలింది స్వరూప. "ఇక నుంచైనా శ్రద్ధగా చదివి, అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు తెచ్చుకుంటే మంచిది. లేకపోతే మీ అమ్మా నాన్నలకు నీ కాపీ విషయం చెప్పాల్సి ఉంటుంది." అని చెప్పింది టీచర్.
స్వరూప శ్రుతి వద్దకు చేరి, తనకు అర్థం కాని విషయాలు తప్పించుకుంటూ, చదువుపై శ్రద్ధ పెంచి, మంచి మార్కులు తెచ్చుకంటూ తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకంది. టి. వి. లకు, సెల్ ఫోన్లకూ దూరంగా ఉంటుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి