శివానందలహరి:- కొప్పరపు తాయారు

 శ్లో: నిత్యం యోగిమనస్సరోజదల
     సంచారక్షమస్త్వత్క్ర మః
     శంభో తేన కథం కఠోర యమరాడ్యక్షః
     కవాక్షతిః !
     అత్యన్తం మృదులం త్వధంఘ్రియుగలం హా
      మే మనశ్చింతయ-
     త్యేతల్లోచన గోచరం కురు విభో 
      సంవాహయే ,!!

 భావం: ఓ శంకరా ! నిత్యము యోగుల మనసులనే తామర రేకుల పై సంచరించుటకు తగిన నీ పాదము కఠినమైన తలుపుల వంటి యముని వక్షస్థలమును ఎట్లు గాయపరిచింది? 
మిక్కిలి మెత్తనైనా నీ పాదముల గురించి నా మనసు చిందించుచున్నది. ఓ ప్రభూ ! వాటిని చూపించుము చేతితో వత్తేదను.
              ******

కామెంట్‌లు