లోకం సమస్తం శుభం:-డా.పివిఎల్ సుబ్బారావు,-శ్రీమతి కె .వీరమాత..
1.
గతం 2024 స్మృతి! 

వర్తమానం 2025 ప్రగతి! 

భవిష్యత్తు 2026 పురోగతి!

2.
ఆది అంతం లేనిది కాలం !

ఆది అంతాల మధ్య జీవితం! 

దైవకృపతో ప్రారంభం జీవనం! 

మనోహరంగా ముగియాలి!

 ఉన్నా పోయినట్లు గాక! 

పోయినా ఉన్నట్లనిపించాలి!

3.
మనంజీవితాన్ని,
               మలచుకోవాలి!

 జనం ఆ జీవనం ,
              తలచుకోవాలి!

గతం ఓ అలుక్కుపోయిన,  
                రంగులచిత్రం! 

వర్తమానం శ్రద్ధగా గీస్తున్న,   
      సప్తవర్ణ శోభిత చిత్రం! 

భవిష్యత్తు ఊహకందని,
      కాలంగీసే  విచిత్రచిత్రం! 

4.
మనకు తెలిసిన క్షణం ,
                      మన ఆది! 

అంతం ఆసన్నమయ్యే,
    క్షణమేదో తెలియనిది!

 ఈ జాగరూకతే ,
    అవసరం అనుక్షణం!
-----------------------------
నూతన ఆంగ్ల సంవత్సరం, 2025 శుభాకాంక్షలు, అందిస్తూ ,
డా.పివిఎల్ సుబ్బారావు,
శ్రీమతి కె .వీరమాత..

కామెంట్‌లు