విముక్తి!!!:- డా.ప్రతాప్ కౌటిళ్యా
ఒకప్పుడు అక్కడ ఒక అడవి ఉంది. 
ఇప్పుడు అది ఒక నదిగా పారుతుంది.!!

అజ్ఞాత జ్ఞాపకాలు 
జలపాతాలుగా మారకముందే 
అన్నింటినీ తనలో కలుపుకునే మట్టి 
ఒక కొత్త విత్తనాన్ని మొలకెత్తించింది.!!?

రేపటి నీటి అడవి కోసం 
కన్నీటి చీకటి ఎదుట 
ఒక దీపం ఆరిపోయింది.!!!

పూలన్నీ దివ్యేలై వెలుగుతుంటే 
ఆకులు దుఃఖంతో ముఖం దాచుకుంటున్నాయి. 

వెలుగులు మోదుగలై 
మొగలి వాసనలు వెదజల్లుతున్నాయి.!!
చెట్టును పాతిపెట్టిన చోట 
వజ్రాల గట్టు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది.!!?

చూపుల రాశులను పోసినచోట 
చుక్కలు మొలుస్తున్నట్లు తెలుస్తుంది.!!

యుద్ధం గెలిచిన ఉదయం 
భూమిని ఢీ కొట్టింది.!!
ఓడిన హృదయం సముద్రంగా మారింది.!!

శక్తికి విముక్తి లేదనుకున్నాం 
కానీ అది నిజం కాదు!!!!!!!!?

తమ్ముడు బావయిపల్లీ డాక్టర్ వెంకటేశ్వరరావు కు నివాళి. 

డా.ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు