05.
దివ్య దేశములందు పూజలు దిండి హర్షము నందుతూ
నవ్య రూపములందు నిత్యము నాంత్రరత్నములందుతూ
భవ్య మూర్తుల నావహించియు భక్తవర్యుల బ్రోవుచూ
అవ్యయా! కృపసేసి,మేల్కొని,ఆదుకో! ధరనేలుకో!
(దిండి=అధిక,నాంత్రరత్నము=స్త్రోత్రరత్నము,అవ్యయుడు=తరగని వాడు, విష్ణువు)
06.
కోడిపుంజులు లేచి కూయుచు గొల్లపల్లెలు మోగగా,
నాడువారలు నిండ్ల ముంగిట నద్దమట్లుగ నూడ్చియున్
పేడనీళ్ళను చల్లి ముగ్గులు పెట్టి రంగులు నింపగా
మేడ మంచము డిగ్గి,దేవర! మేలుకో, ధరనేలుకో!
(డిగ్గి=దిగి)
============================
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం
కరీంనగరం
9963991125
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి