*బాల కవితా కుసుమాలు,బాల కవితా పుష్పాలు పుస్తకావిష్కరణ*

 పెందోట బాల సాహిత్య పీఠం ఆధ్వర్యంలో పెందోట వెంకటేశ్వర్లు చేస్తున్న సాహిత్య కృషి అభినందనీయమన్నారు డాక్టర్ కాసర్ల నరేష్ రావు.సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రముఖ ఉపాధ్యాయులు, కవి పెందోట వెంకటేశ్వర్లు సంపాదకులుగా బాల కవిత కుసుమాలు,బాల కవితా పుష్పాలు అను పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ కాసర్ల నరేష్ రావు పెందట వెంకటేశ్వరరావు చేస్తున్న సాహిత్య కృషిని అభినందించారు.ఈ పుస్తక రచనల ద్వారా బాల సాహిత్య పీఠం పిల్లలకి ఎంతో స్ఫూర్తినివ్వడమే కాకుండా పిల్లలను బాల కవులుగా,బాల రచయితలుగా తయారు చేసే విధంగా స్ఫూర్తిగా నిలుస్తుందని అభినందించారు.పుస్తకావిష్కరణ గావించిన ఎర్రోజు వెంకటేశ్వర్లు,బైతి దుర్గయ్యలు మాట్లాడుతూ పెందోట వెంకటేశ్వర్లు గావించిన రచనలు, కవితలు రేపటి తరానికి సోపానాలుగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.బాల సాహిత్య పీఠం  నిర్వహించిన  సాహిత్య పోటీల్లో 15 పాఠశాలకు సంబంధించిన విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు నేడు 5-1బహుమతుల ప్రధానోత్సవం గావించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు,కళాకారులు,విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులు,ఆయా పాఠశాలల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు