పాతపొన్నుటూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆటపాటలతో సందడి చేశారు.
ముగ్గులు వేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. అందరూ ఒకరికొకరు మిఠాయిలను పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 2025 కొత్త సంవత్సర కేక్ ను కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావుకు శాలువా జ్ఞాపిక పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈనాటి కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు ఉపాధ్యాయులు అందవరపు రాజేష్, పైసక్కి చంద్రశేఖర్, బూడిద సంతోష్ కుమార్, బొమ్మాళి నాగేశ్వరరావు, యిసై సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావు, కుదమ తిరుమలరావులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి