తిరుమలరావుకు రిపబ్లిక్ డే ప్రశంసాపత్రం

 కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ వర్క్ ఎడ్జిస్ట్ మెంట్ పై పాతపొన్నుటూరు యుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు మరో ఘనత సాధించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల ఇరవై ఆరున ఆయన రచించిన కవితతో ఈ ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తొలి జానపద సాంస్కృతిక అకాడమీ అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ నేతృత్వంలో కవితా సభ నిర్వహించగా తిరుమలరావు పాల్గొని ఈ గౌరవం పొందారు. 
ఆర్ట్ ఫౌండేషన్ ఛైర్మన్ పొట్లూరి హరికృష్ణ నేతృత్వంలో, లహరి మహేందర్ గౌడ్ సమన్వయంతో హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని జాతీయ స్థాయిలో అంతర్జాలం ద్వారా నిర్వహించిన తిరంగా కవి తరంగా కార్యక్రమంలో పాల్గొన్న తిరుమలరావును అభినందిస్తూ వారు ప్రశంసాపత్రాన్ని పంపారు. తిరుమలరావు రచించిన 
భారతీయ ధర్మస్మృతి అనే కవిత లో, భారత రాజ్యాంగం మానవీయ బంధాలకు నాందిపలికే మహోన్నత గ్రంథమని, లింగ వివక్షత నిర్మూలనపై తపించే మనోవిజ్ఞానశాస్త్రమని, దీనిని జీవితాలకు వ్యవస్థలకు అన్వయించుకోవాలన్న లక్ష్యంగా గణతంత్ర దినోత్సవం ఆవశ్యకతను సంతరించుకుంది అంటూ  వివరించారు. తిరుమలరావుకు రిపబ్లిక్ డే ప్రశంసాపత్రం లభించుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు