నీ కోసం ఉద్యానవనంలో
ఆశగొలిపే నయనాలతో
ఎదురుచూస్తున్నాను!
నా ఎదురుచూపుకు
అక్కడి వృక్షాలు సైతం
నా మేనుపై పిల్లగాలులను
వెదజల్లుతున్నాయి!
అక్కడి నెమళ్ళు
తమ నాట్యంతో నన్ను
సమయాన్ని -
తెలియకుండా చేస్తున్నాయి!
లేళ్ళు చెంగు చెంగున
పరుగెడుతున్నాయి
కుందేళ్ళు పచ్చిక బయళ్లలో
హాయిగా గెంతుతున్నాయి!
కోకిలమ్మ తన రాగంతో
మధుర గీతాలు ఆలపిస్తున్నది
పిచ్చుకలు కిచ కిచ ధ్వనులు
చేస్తున్నాయి.....!
భాస్కరుని కిరణాలు
నా మోముపై పడకుండా
తరువు పత్రాలు
నాకు నీడను ఇస్తున్నాయి!
అక్కడి సెలయేరు ప్రవాహ శబ్దాలు
చక్కని సంగీతంలా -
వినసొంపుగా ఉన్నాయి!
అక్కడి పుష్పాలపై తుమ్మెదలు వాలి
వాటిలోని మకరందాన్ని ఆత్రంగా,
జుర్రుకుంటున్నాయి!
ఇంత ఆహ్లాదకరమైన-
అందమైన ప్రదేశంలో,
నన్ను కలవడానికి -
ఇంత ఆలోచించాలా?!
ఇంతటి మధురాతి మధురమైన
వాతావరణానికి
ఎవరి హృదయమైనా-
పులకరించవలసిందే కదా ప్రియతమా!!
***
నీకోసం ...!!-షాహీన్ సిద్డిఖా , నల్లగొండ .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి