//విద్యార్థులు క్రమశిక్షణ ను అలవర్చుకోవాలి // రేపాల మదన్ మోహన్..

 విద్యార్థులు  క్రమశిక్షణ అలవర్చుకోవాలని ఉమ్మడి నల్గొండ -ఖమ్మం జిల్లాల లయన్స్ క్లబ్ డిస్టిక్ట్ ఛైర్పర్సన్,యూత్ ఎంపవర్మెంట్,ట్రైనర్,లయన్ పి ఎంజెఎఫ్ రేపాల మదన్ మోహన్  అన్నారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల ప్రభుత్వ మోడల్ స్కూల్ లో శాలిగౌరారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ ను రేపాల మదన్ మోహన్ అందజేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువు తో పాటు మానసిక, శారీరక వికాసాని కీ క్రీడలు ఎంతో అవసరమన్నారు. చాలా పాఠశాల లో క్రీడా వస్తువులు లేక విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారన్న ఉద్దేశ్యం తో తాను సొంత ఖర్చుల తో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 221 ప్రభుత్వ పాఠశాలకు స్పోర్ట్స్ కిట్స్ ను అందజేశానన్నారు.ముఖ్యంగా విద్యార్థులు మొబైల్ ఫోన్ లకు దూరంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమం లో క్లబ్ అధ్యక్షులు డెంకల సత్యనారాయణ, చార్టర్ ప్రసిడెంట్ బుడిగె శ్రీనివాసులు, ఫాస్ట్ జోన్ ఛైర్మెన్ ఎర్ర శంబులింగారెడ్డి, మెంబర్స్ దునక వెంకన్న, గుండ్ల రామ్మూర్తి,నల్గొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిమ్మల పిచ్చయ్య,మోడల్ స్కూల్ ఇంచార్జ్ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఉపాధ్యాయులు చిత్తలూరి సత్యనారాయణ, కుక్కడపు శ్రీనివాస్, స్కూల్ పీడీ బొడ్డు మల్లేష్  ఉపాధ్యాయులు కేతేపల్లి శ్రీనివాస్, దామెర్ల కృష్ణయ్య, సంపత్ కుమార్, శ్రీరాములు, అనురాధ, సంగీత, సంధ్య, సృజన, శ్వేత, స్వప్న, తండు ఆంజనేయులు, యూనస్, రవి, వేణు, జీబున్నీస, సరస్వతి, సువర్ణ, పావని, రాజు, వెంకటయ్య,విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు