నడవ:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
విశాల గగనంలో మైదానం
అలల ఆట బతుకు
తెరచాప దారిదీపం

వెలుగునీడల 
ఏతం ఏకాంత లహరికాదు
బిగి పిడికిలి కొయ్య వెదురు 
సాగే యానంలో సముద్ర ధైర్యం 
నడవ నడిపే పడవదే


పైన నింగి
కింద నేల
నడుమ సాగే అలల శయ్యపై క్రీడ
బతుకంటే మనిషి
మనిషంటే ఆశ
వలయంలో మద్దెల దరువు

కామెంట్‌లు