-విజయవాడలో అందజేసిన సాహితీ సంస్థలు
===================================
పత్రికారంగంతో పాటు సాహిత్యం, సామాజిక సేవా రంగాల్లో కృషి చేస్తున్న జర్నలిస్ట్ బోణం గణేష్ కు యువతేజం జాతీయ ప్రతిభా పురస్కారం లభించింది. శ్రీశ్రీ కళావేదిక, వరల్డ్ రైటర్స్ ఫోరం, వరల్డ్ రైటర్స్ అకాడమీ, తెలుగు నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు సంయుక్తంగా అందజేస్తున్న తెలుగు కీర్తి పురస్కారాల ప్రదానం మంగళవారం ఘనంగా జరిగింది. కౌత పూర్ణానంద విలాస్ లో జరిగిన ఈ వేడుకలో శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్, ఏపీఎస్పీఎఫ్ ఎస్పీ కొండా నరసింహారావు, బోయి భీమన్న సాహిత్య నిధి ట్రస్ట్ చైర్ పర్సన్ బోయి హైమవతి, నన్నయ యూనివర్శిటీ వీసీ తరపట్ల సత్యనారాయణ చేతుల మీదుగా గణేష్ యువతేజం పురస్కారం అందుకున్నారు. సాహిత్యం, పత్రికా రంగంలో గణేష్ చేస్తున్న సేవలకు రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష సేవారత్న పురస్కారాన్ని కూడా ఇప్పటికే ప్రదానం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని రామన్నగూడెం గ్రామంలో జన్మించిన గణేష్ వృత్తి రీత్యా అనేక జిల్లాల్లో పనిచేసి ప్రస్తుతం విజయవాడలో నివశిస్తున్నారు. పాత్రికేయుడిగా, ప్రకృతి పరిరక్షకుడిగా, సమాజ సేవకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న వయసులోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకుంటున్న గణేష్ కు పలువురు సాహిత్యాభిమానులు అభినందనలు తెలిపారు.
---
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి