సుప్రభాత కవిత : -బృంద
ప్రపంచం చూడాలని 
అనిపించేనేమో! ఆగి నిలిచాయి 
తేటనీటి బిందువులు 
పత్రము పై  అందంగా!

ప్రకృతి తనను తాను 
చూడనెంచెనేమో... 
నీటి అద్దాన  చూసి 
మురిసేను సరదాగా!

తీగకు దండ చుట్టి ఇవ్వాలని
అనిపించేనేమో!
పోగు చేసుకున్నాయి ముత్యాలను 
ఆకులు జాగ్రత్తగా!

పట్టి ఉంచిన బొట్టు 
పచ్చనాకుకేమీ కాదు....
వచ్చి మరలిపోవు 
చుట్టమేగా!

చుక్కలో దాగున్న 
చుట్టూ పరిసరాలు 
తనకేమీ కాదు 
వదిలి జారేపోవు తనదారిన!

బంధమంటూ పట్టుకుని 
బ్రతుకంతా  సాగినా 
గట్టు వచ్చినాక దిగే తీరాలి 
చెప్పకనే ఒంటరిగా!

జనన మరణాల మధ్య 
మమతలాడే ఆట 
మనిషి బ్రతుకు 
నీటి మీద బుడగ నిజమేగా!

వెలుగుల వలపరచి 
మాయ మరచి మనసును 
గంతులేయించే కోటి ఆశల
కొత్త వేకువకు 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు