న్యాయములు-733
సోపానారోహణ న్యాయము
*****
సోపానం అనగా మెట్టు. ఆరోహణ అనగా కింద నుండి పైకి వెళ్ళడం,అధిక్రమం , అధిరోహించడం,ఎక్కడం తక్కువ నుండి అత్యధికం వైపు అనే అర్థాలు ఉన్నాయి.
క్రమంగా ఒక్కొక్కటిగా మెట్లన్నీ ఎక్కి మేడపైకి లేదా అత్యున్నత స్థానం వరకు చేరుకోవాలి.
అనగా ఏమిటఎవరైనా ఎత్తుకు ఎదిగిన వారు, ఉన్నత స్థాయిని పొందిన వారిని అడిగితే తెలుస్తుంది. వాళ్ళు ఒకేసారి అమాంతంగా పైకి ఎదిగారా? ఉన్నత స్థాయికి చేరుకున్నారా? అనేది నిశితంగా పరిశీలిస్తే...
చెప్పే జవాబు లేదా దొరికే సమాధానం ఒక్కటే.మెట్టు మెట్టుకూ అడుగు ముందుకు పోనీయకుండా .. అడ్డుకునేందుకు అడ్డం పడే అవరోధాలు ఎన్నో.అవమానాలు ఎన్నెన్నో...
నారికేళమంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి అనవసరమైన మాటల పీచూ తీసేయాలి.అంతే కాదు అహంభావపు చేష్టల తల పగల గొట్టాలి.అప్పుడే అందులోని తీయనిది జలమంటి గెలుపును ఆస్వాదిస్తూ విజయ పతాకాన్ని ఎగురవేయగలం.
మన పెద్దవాళ్ళు చెప్పే ప్రతి న్యాయము వెనుక గొప్ప బాధ్యతతో మిళితమైన ఉపదేశం వుంటుందనేది ఇదిగో ఇలాంటి న్యాయాల ద్వారా తెలుసుకోవచ్చు.
అమాంతంగా పైకి ఎదిగిన వారు,ఆ పై వారి అసహజ ప్రవర్తన నచ్చక "పెరుగుట విరుగుట కొరకే" అని హెచ్చరించారు.అలాగే అనుకోకుండా వచ్చే సిరి కానీ,పదవి కానీ కొందరిని మామూలుగా ఉండనీయవట.అందుకే నడమంత్రపు సిరి - నరం మీద పుండు" ఇవి మనిషిని స్థిరంగా ఉండనీయవనింట మందలించారు.
మరి మన "సోపానారోహణ" ఎలా ఉండాలి? అనేది చూద్దాం. దీని కోసం చిన్నప్పటి నుండే పిల్లలను సక్రమంగా తీర్చి దిద్దాలి.
మనిషి యొక్క జీవన నైపుణ్యాలే విజయానికి సోపానాలు అవుతాయనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మరవొధ్దు.
ముఖ్యంగా పిల్లలు కానీ పెద్దలు కానీ పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. అందులో బాధ్యత, సహాయ పడే గుణం,సమైక్యతా శక్తి ఉన్నాయి.కాబట్టి ఈ విలువలను పాటించేలా పిల్లలకూ, తోటివారికి అర్థమయ్యేలా చెప్పాలి.
అప్పుడే క్రమానుగతంగా అభివృద్ధి సాధ్యమవుతుందని మన పెద్దలతో పాటు, ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.
అందువలన మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఉరికురికి పోయి- బోర్లా పడ్డట్టు" కాకుండా నిధానంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయంతో ఎలాంటి సోపానాలనైనా సునాయాసంగా ఆరోహణ చేయవచ్చు.
అయినా మనకు కావలసింది క్రమానుగతమైన విజయం సాధించడం అదే ఈ సోపానారోహణమైన గెలుపు. బాగుంది కదండీ! మరి మనం ఈ నూతన సంవత్సరంలో ఆచి తూచి అడుగులు వేస్తూ ఆత్మ విశ్వాసమే ఆయుధంగా అనుకున్నది సాధిద్దాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి