శివానందలహరి:- కొప్పరపు తాయారు

 శ్లో: 
బాణత్వం వృషభత్వ మర్ధవపుషా భార్యాత్వమార్యా పతే
ఘోణిత్వం సభితా మృదంగ
వహతా చేత్యాది రూపం దదౌ !
త్వత్ఫాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్ధేహభాగో హరిః 
పూజ్యాత్పూజ్యతరః స ఏవ హి  నా చేతౌ  కో  వా తధన్యోధి కః‌ !!

భావం: ఓ భవానీపతీ! విష్ణుమూర్తి నీకు భాణముగాను,
వృషభముగాను, అర్థశరీరముతో 
భార్యగానూ, వరాహముగానూ, మిత్రుడు గానూ,మృదంగ వాదకుడుగాను, రూపమెత్తి  నీ పాదములపై తన నేత్రము నర్పించి, నీ దేహములో భాగముగా ఉండెను. కనుకనే 
అతడు పూజలలో కెల్ల పూజ్యుడు, అంతకంటే అధి కుడు, వేరొకడెవడు కలడు. 
          *****

కామెంట్‌లు